Supreme Court: గురుద్వారాలో ప్రవేశించడానికి, పూజ చేయడానికి నిరాకరించిన క్రైస్తవ ఆర్మీ అధికారిని తొలగించిన కేసును సుప్రీంకోర్టు విచారించింది. ‘‘అతను ఆర్మీకి పనికి రాడు’’ స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. అతడిని అసమర్థుడిగా ముద్ర వేసింది. తన తొటి సిక్కు సైనికులు విశ్వాసాన్ని గౌరవించనందుకు అతడిని తొలగించిన ఆర్మీ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.