China: మాల్దీవులు, భారత్‌ని కాదని డ్రాగన్ దేశం చైనాతో సంబంధాలను పెంచుకుంటోంది. కొత్తగా వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత్ వ్యతిరేక, చైనా అనుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఆ దేశంలో మానవతా సాయం అందిస్తున్న భారత సైనికులను వెళ్లిపోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు. తాజాగా మాల్దీవులు, చైనాతో రక్షణ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం జరిగిన తర్వాతి రోజే ముయిజ్జూ భాతర వ్యతిరేక స్వరం పెంచుతూ.. భారత్ సైనికులే కాకుండా, పౌర దుస్తుల్లో ఉన్న ప్రతీ ఒక్కరు వెళ్లిపోవాల్సిందే…