యాక్షన్ మూవీ ప్రియులకు, బాక్సింగ్ అభిమానులకు ఐఫీస్ట్ గా ఉండబోతున్న’లైగర్’ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా కన్పిస్తున్న విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ పాన్ ఇండియా మూవీలో మైక్ టైసన్ నటిస్తుండటంతో ‘లైగర్’కు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో థాయిలాండ్ స్టంట్…
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద తొలిసారి ‘గాడ్ ఆఫ్ బాక్సింగ్’ మైక్ టైసన్ దర్శనం ఇవ్వబోతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’లో కీలక పాత్రను టైసన్ పోషించబోతున్నాడు. గత కొంతకాలంగా ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా, చిత్ర బృందం ఇంతవరకూ పెదవి విప్పలేదు. తాజాగా విజయ్ దేవరకొండ… టైసన్ ఆగమనాన్ని తెలియచేస్తూ, అధికారికంగా ట్వీట్ చేశాడు. ‘మీకు పిచ్చెక్కిస్తామని హామీ ఇచ్చాం. అదిప్పుడు మొదలు కాబోతోంది.…