టీ20 ప్రపంచకప్ 2026, ఐపీఎల్ 2026కు ముందు మరో పొట్టి టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 నేటి నుంచి ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో మాజీ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఢీకొంటుంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మ్యాచ్‌కు ముందు…