ప్రయాణికులను త్వరగా గమ్య స్థానాలకు చేర్చేందుకు, హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఏర్పాటైన మెట్రో రైలు పరుగులు పెడుతుండటంతో.. మెట్రో స్టేషన్లకు కూడా ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. ప్రస్తుతం నడుపుతున్న మెట్రో రైళ్లు సరిపోవడం లేక కిక్కిరిసి మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఎక్కువసేపు మెట్రోస్టేషన్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే కొంత కాలంగా.. మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే మెట్రో…