Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు మెట్రో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రయాణికుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని మెట్రో రైల్ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం మెట్రో రైల్ చివరి రైలు సమయాన్ని పొడిగించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:00 గంటలకు బదులుగా 11:45 నిమిషాలకు బయలుదేరేలా మార్పు చేశారు.…