విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు అయ్యింది.. దీనిపై కీలక ప్రకటన చేశారు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి.. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్ కు అవకాశం ఇచ్చామని తెలిపారు.. గరిష్టంగా 3 కంపెనీలు కలిసి జేవీగా టెండర్లు వేసుకునే అవకాశం ఉందన్నారు..
AP Metro Rail Projects: విజయవాడ, వైజాగ్ మెట్రో రైల్‌కు రంగం సిద్ధం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం రేపు టెండర్లు పిలవనుంది. రూ. 21,616 కోట్లతో వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నారు.