మహారాష్ట్ర కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇవ్వబోతున్నారు. గతంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం వివాదాస్పద ముంబై మెట్రో కార్ షెడ్ ప్రాజెక్ట్ ను ఆరే కాలనీలో నిర్మించడాన్ని వ్యతిరేకించింది. దీన్ని కంజుర్‌మార్గ్ కు మార్చాలని నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఆరే కాలనీలోనే మెట్రోకార్ షెడ్ ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం. 2019లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం హాయాంలో అనుకున్న…