Isro: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. వాతావరణ ఉపగ్రహం INSAT-3DS ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌కి తరలించారు. ఈ శాటిలైట్‌ని జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్(GSLV-F14) ద్వారా ప్రయోగించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ (MoES) కోసం బెంగళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్‌లో ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు.