బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు పెంచేందుకు జగన్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రాష్ట్రంలోనే పేదల విద్యార్థులు బాగుండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంలో తీసుకువచ్చారని.. చంద్రబాబు మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు.. వాళ్ళ బంధువులు చదవచ్చు.. కానీ బడుగు వర్గాల పిల్లలు మాత్రం చదువుకోకూడదని న్యాయస్థానాలకు వెళ్ళాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
గతంలో వైసీపీ కోసం పనిచేసిన సమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. బీహార్ వాడొచ్చాడు వాడి వల్ల ఏమవుతుందన్న చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు పీకేతో కలుస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. పది మంది ప్రశాంత్ కిషోర్‌లు వచ్చినా ప్రజలంతా సీఎం జగన్ వెంట ఉన్నారన్నారు.