గ్రూప్-4 అభ్యర్థులకు టీజీపీఎస్సీ శుభవార్త అందించింది. సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదలచేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్ ఆప్షన్ల కోసం నమోదు చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. అలా చేసిన వారికే విడతల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. అయితే అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్…