Indonesia's Merapi Volcano Erupts: ఇండోనేషియాలో మెరాపి అగ్నిపర్వతం శనివారం బద్దలైంది. దీని ప్రభావంతో ఏడు కిలోమీటర్ల మేర ధూళి మేఘాలు కమ్ముకున్నాయని ఆ దేశా వివత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇండోనేషియాలోని యొగ్యకర్తా ప్రాంతంలో ఉన్న మెరాపి అగ్నిపర్వతం స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు విస్పోటనం చెందింది. 1.5 కిలోమీటర్ల మేర లావా ప్రవాహాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిపర్వతం నుంచి మూడు నుంచి 7 కిలోమీటర్ల పరిధిలోని ప్రజల కార్యకలాపాలు నిలిపివేయాలని…