రానా దగ్గుబాటికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. అతను చేసే ఇంటర్వ్యూల్లోనే కాదు, తనను చేసే ఇంటర్వ్యూలలోనూ దాన్ని సందర్భానుసారం బయట పెడుతుంటాడు రానా. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా బిజీబిజీగా గడిపేసిన రానాను ‘ఎందుకలా?’ అని అడిగితే, ‘ఖాళీగా ఉంటే మా నాన్న ఊరుకోడు’ అంటూ సెటర్స్ వేసే వాడు. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ మూవీ విడుదల కావాల్సి ఉంది. తొలుత ఇది ఓటీటీలో విడుదల…