కళల కాణాచిగా పేరొందిన తెలుగు ప్రాంతాలలో తెనాలి కూడా స్థానం సంపాదించింది. ఇక ఆ ఊరి అందం చూసి ‘ఆంధ్రా ప్యారిస్’ అన్నారు ఇంగ్లీష్ జనం. సావిత్రి, జమున, జగ్గయ్య, గుమ్మడి వంటి ప్రముఖ నటీనటులు ఈ ప్రాంతంవారే! అదే నేలపైనే మధురగాయని యస్.జానకి కూడా కన్ను తెరిచారు. చిన్నప్పటి నుంచీ అందరినీ తన మధురగాత్రంతో సమ్మోహితులను చేస్తూ వచ్చారు జానకి. ఇక ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే జానకి తొలుత పాడిన సినిమా పాట మాత్రం…