Manipur : మణిపూర్‌లో హింస చల్లారడం లేదు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఆదివారం ఉదయం కుకీ, మెయిటీ కమ్యూనిటీల మళ్లీ కుల వివాదం రాజుకుంది. ఈ కారణంగా గ్రామ వాలంటీర్ల మధ్య కాల్పులు జరిగాయి.
Manipur:మణిపూర్‌లో ఇటీవల కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన నలుగురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. తాజాగా వీరందరిని హత్య చేసినట్లు తెలిసింది. చనిపోయిన వారిలో తండ్రీ, అతని కొడుకు కూడా ఉన్నారు. చురచంద్ పూర్, బిష్ణుపూర్ జిల్లాల మధ్య కొండల్లో మిలిటెంట్లు నలుగురు గ్రామస్తులను కిడ్నా్ప్ చేశారు. శీతాకాలం కావడంతో మంట కోసం కట్టెలు తీసుకువచ్చేందుకు సమీప అడవుల్లోకి వెళ్లిన సమయంలో వారిని అపహరించారు. వీరందర్ని మిలిటెంట్లు చంపినట్లుగా ఈ రోజు పోలీసులు వెల్లడించారు.
మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గిరిజనులు అధికంగా ఉండే కంగ్గుయ్ ప్రాంతంలోని ఇరెంగ్, కరమ్ వైఫే గ్రామాల మధ్య ఈ దాడి జరిగిందని కాంగ్ పోక్పి అదనపు పోలీసు సూపరింటెండెంట్ తోలు రాకీ తెలిపారు.
Manipur Violence: గిరిజన, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకోవడంతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. స్కూళ్లు, వాహనాలు, చర్చిలకు ఆందోళనకారులు నిప్పుపెడుతున్నారు. సైన్యం, పారామిలిటీ బలగాలను రాష్ట్రంలో మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సైన్యం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. సైన్యం, అస్సాం రైఫిల్స్ నుంచి 10,000 మంది సైనికులు మోహరించారు.