Mehbooba Mufti: బీజేపీ పార్టీ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ. ఏదో రోజు బీజేపీ భారత జాతీయ జెండాను మార్చి కాషాయ జెండాను తీసుకువస్తారని ఆమె వ్యాఖ్యానించారు. శ్రీనగర్ లో మాట్లాడిన ఆమె బీజేపీపై విమర్శలు గుప్పించారు. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని, జెండాను దోచుకున్న విధంగా బీజేపీ జాతీయ జెండాను కూడా మార్చి వేస్తుందంటూ ఆరోపించారు. రాబోయే కాలంలో బీజేపీ రాజ్యాంగాన్ని, దేశంలోని లౌకిక…