ఈ నెల 16వ తేదీన ఏపీ కెబినెట్ భేటీ కానుంది. ఈ నెల 10వ తేదీన జరగాల్సిన కెబినెట్ అజెండా వాయిదా పడటంతో.. ఆరోజు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. నిన్న జరిగిన కేబినెట్ రోజు.. రతన్ టాటా చనిపోవడంతో అజెండాను మంత్రి వర్గం వాయిదా వేసింది.
సచివాలయంలో గ్రూప్ -2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ చివరి వారంలో నిర్వహణకు సాధ్యాసాధ్యులపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరి వారానికి గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి డిప్యూటీ సీఎం అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని ఆయన…