1990లలో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన హీరోయిన్లలో మీనా ఒకరు. చిన్నతనంలోనే నటిగా కెరీర్ ప్రారంభించి, తర్వాత హీరోయిన్‌గా అగ్రస్థానంలో నిలిచారు. భాషతో సంబంధం లేకుండా రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సూపర్‌స్టార్‌లతో నటించి, మూడు దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. మీనా కెరీర్‌లో గ్లామర్ పాత్రలకన్నా ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే లేడీ-ఓరియెంటెడ్ పాత్రలే ఎక్కువ. అదే కారణంగా ఆమెకు విభిన్నమైన అభిమాన…