RG Kar Medical College: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ చదువుతున్న గిరిజన మహిళా వైద్య విద్యార్థి మరణం వివాదాస్పదంగా మారింది. పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసు తర్వాత, మరోసారి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ వార్తల్లో నిలిచింది.
ప్రొఫెసర్ల వేధింపులకు విద్యాకుసుమాలు రాలిపోతున్నాయి. మొన్నటికి మొన్న ఒడిశాలో అధ్యాపకుల వేధింపుల కారణంగా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మరువక ముందే గ్రేటర్ నోయిడాలోని శారద యూనివర్సిటీలో దంద వైద్య విద్యార్థిని సూసైడ్ చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న హర్ష ఘటన మరువకముందే మరో ఎం.బి.బి.ఎస్. విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. 2020 బ్యాచ్ కు చెందిన సనత్ మెడికల్ కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.