జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు న్యాయస్థానంలో తాత్కాలిక ఉపశమనం లభించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు 2 నెలల మధ్యంతర బెయిల్‌ను బాంబే హైకోర్టు మంజూరు చేసింది.
మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. డిసెంబర్ 11వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఈడీ విచారిస్తున్న ఈ కేసులో.. ఢిల్లీ హైకోర్టు తన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
దాణా కుంభకోణం కేసులో వైద్య కారణాలతో బెయిల్ పొందిన ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారని, బీహార్ మాజీ ముఖ్యమంత్రికి మంజూరైన ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరుతూ సీబీఐ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.