MGM : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో డెడ్ బాడీ మారిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఒకరికి బదులుగా మరొకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోక కుమారస్వామి (50) మూడు రోజుల క్రితం అపస్మారక స్థితిలో చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. ఆసుపత్రి అధికారులు పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని…