ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విచారం వ్యక్తం చేశారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రధాని మోడీ సందేశాన్ని నిర్మలా సీతారామన్ అందించారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతులు నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.