Central Team: కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యమైన భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు.