CM Revanth Reddy: మేడారం మహా జాతరకు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి సీతక్క తెలిపారు.
మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టనుంచి కుంకుమ భరణి రూపంలో బయల్దేరి వచ్చిన సమ్మక్క.. గద్దెకు చేరుకుంది. సమ్మక్కను ప్రధాన పూజారి ప్రతిష్టించారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించే సమయంలో లైట్లు నిలిపివేశారు. మరోవైపు.. అమ్మవారిని గద్దెపై ప్రతిష్టించే సమయంలో భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించడంతో భారీ ఎత్తున భక్తులు జై సమ్మక్క తల్లి-జై సారక్క తల్లి అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే.. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు…
Mini Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు సిద్దిపేట జిల్లాలో నిర్వహించే మినీ మేడారం జాతరలకు వచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
Medaram Tourists: మేడారం మహాజాతర ప్రారంభం కావడంతో సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు పలువురు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.
మేడారం మహా జాతరలో తొలి ఘట్టం నిర్విఘ్నంగా పూర్తైంది. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ నిన్న (బుధవారం) అర్ధరాత్రి 12.12 గంటలకు గద్దెను అలంకరించారు. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం ఇవాళ జరగనుంది.
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క మేడారంలోనే ఉండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిసారీ తల్లులను వనంలో నుంచి గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు తాను ఉంటున్నాని తెలిపారు. ఈసారి తన ఆధ్వర్యంలో తీసుకురావడంత ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే.. మేడారం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అంతేకాకుండా.. భక్తులు తల్లులను దర్శించుకునే సమయంలో క్యూలైనల్లో…
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు అట్టహాసంగా ప్రారంభమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జాతర కొనసాగనుంది. జాతరలో ముఖ్య ఘట్టమైన పగిడిద్దరాజు, గోవిందరాజులు నేడు గద్దెలపైకి రానున్నారు. అంతేకాకుండా.. మధ్యాహ్నం కన్నెపల్లి నుంచి గద్దెపైకి సారలమ్మను తీసుకురానున్నారు. అయితే.. మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మేడారం జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది…
ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మహ్మద్ గౌస్ పల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. గాయపడిన వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడారం జాతరకు ట్రాక్టర్ లో 8 మంది వెళ్తున్నారు. అయితే మహ్మద్ గౌస్ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు.. వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న 8 మందికి…