Vasireddy Padma: ఏపీలో కృష్ణా జిల్లాకు చెందిన మెడికో విద్యార్థిని హత్య కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ఈ అంశంపై స్పందించారు. మెడికో విద్యార్థిని హత్య దారుణమని.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ స్నేహాలు విషాన్ని చిమ్ముతున్నాయని ఇప్పటికైనా యువత తెలుసుకోవాలని ఆమె సూచించారు. సోషల్ మీడియాలో పుట్టే ప్రేమలను మనం అంచనా వేయలేమని అభిప్రాయపడ్డారు. ప్రేమ పేరుతో యువకుడు వేధిస్తున్నట్లు తపస్వి ఒక్కమాట కూడా చెప్పలేదని తల్లిదండ్రులు అంటున్నారని.. పథకం…
ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ విద్యార్థిని హత్య కలకలం సృష్టిస్తోంది.. మెడికోను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసినట్టు చెబుతున్నారు.. మొత్తంగా.. ప్రేమోన్మాది దాడిలో మెడికల్ స్టూడెంట్ తపస్వి ప్రాణాలు కోల్పోయింది.. నేడు తపస్వి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు వైద్యులు.. ఉద్యోగరీత్యా ముంబైలో నివాసం ఉంటున్న తపస్వి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు.. హాస్టల్లో ఉండి ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న తపస్వి… స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం.. అయితే, ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌కు ఇంస్టాగ్రామ్‌లో…
హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అనూష కిర్గిజీస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబిబిఎస్ చదువుతుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే కరోనా నేపద్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లి తో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. పేద గిరిజన కుటుంబానికి చెందిన అనూష తండ్రి…