ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ విద్యార్థిని హత్య కలకలం సృష్టిస్తోంది.. మెడికోను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసినట్టు చెబుతున్నారు.. మొత్తంగా.. ప్రేమోన్మాది దాడిలో మెడికల్ స్టూడెంట్ తపస్వి ప్రాణాలు కోల్పోయింది.. నేడు తపస్వి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు వైద్యులు.. ఉద్యోగరీత్యా ముంబైలో నివాసం ఉంటున్న తపస్వి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు.. హాస్టల్లో ఉండి ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న తపస్వి… స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం.. అయితే, ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌కు ఇంస్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది.. అయితే, అది కాస్తా ప్రేమగా మారింది.. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి రెండేళ్లు గడిచింది.. కానీ, ఆ తర్వాత జ్ఞానేశ్వర్‌ని దూరం పెట్టింది.. ఇదే హత్యకు కారణమైందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..
Read Also: Astrology : డిసెంబర్ 06, మంగళవారం దినఫలాలు
అయితే, వారు ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి గన్నవరంలో కొంతకాలం ఉన్నారట. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో తపస్వి, జ్ఞానేశ్వర్‌పై గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని నుంచి ఇబ్బందులు ఎదురవుతుండటంతో తక్కెళ్లపాడులో ఉంటున్న స్నేహితురాలికి తన బాధ చెప్పుకుని బాధపడేది.. ఇదే సమయంలో.. జ్ఞానేశ్వర్ వేధింపులు ఎక్కువ కావడంతో గత కొన్ని రోజులుగా స్నేహితురాలి గదిలోనే ఉంటుంది.. ఇప్పుడు పరీక్షలకు కూడా సిద్ధం అవుతోంది.. అయితే, తపస్వి అచూకీ తెలుసుకున్న జ్ఞానేశ్వర్.. వారు ఉంటున్న గదికి వెళ్లాడు.. ప్రేమికుల మధ్య గొడవల్ని పరిష్కరించడానికి తపస్వి స్నేహితురాలి ప్రయత్నించినట్టుగా చెబుతున్నారు.. జ్ఞానేశ్వర్‌ను పెళ్లి చేసుకోనని తపస్వి చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడట.. వెంటనే తన వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్‌తో ఆమెపై దాడికి దిగాడు. ఈ పరిణామంతో బెదిరిపోయిన మృతురాలి స్నేహితురాలు కేకలు వేస్తూ పరుగులు పెట్టింది.. ఇంటి యజమానిని తీసుకొచ్చేలోపు గది తలుపులు బిగించి హత్యకు పాల్పడినట్టుగా చెబుతున్నారు.. ఇక, గది తలుపులు తీయకపోవడంతో గ్రామస్తులు తలుపులు పగులగొట్టి నిందితుడి బంధించారు. ఆ సమయంలో నిందితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.. అడ్డుకున్న స్థానికులు.. ప్రాణాలతో కొట్టుమిట్లాడుతోన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్త స్రావం కావడంతో బాధితురాలు ప్రాణాలు విడిచింది..
ఇప్పటికే ఇద్దరి మధ్య విభేదాల నేపథ్యంలో జ్ఞానేశ్వర్‌ను పెళ్లి చేసుకోనని మాట్లాడుతోన్న సమయంలో తపస్వి చెప్పింది.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని అనడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జ్ఞానేశ్వర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.. బాధితురాలు స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె గొంతుపై అదే పనిగా సర్జికల్ బ్లేడ్‌తో గాయాలుచేశాడు… ఆ తర్వాత తన చేతిని కోసుకునే ప్రయత్నం చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. స్నేహితురాలి ఇంట్లో మాట్లాడుకోడానికి వచ్చి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు, మృతురాలిది కృష్ణాజిల్లా కాగా, మృతురాలి తల్లిదండ్రులు ముంబైలో ఉంటున్నట్లు గుర్తించారు. నిందితుడు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు..