తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి భారీగానే రాజీనామాలు వెలువెత్తుతున్నాయి. అయితే.. నేడు టీఆర్‌ఎస్ కి మరో షాక్ తగిలిందనే చెప్పాలి.. బడంగ్‌పేట్ మేయర్ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె తన రాజీనామా లేఖను పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మెయిల్ ద్వారా పంపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బడంగ్‌పేట్ అభివృద్ధి కోసం అప్పటి పరిస్థితుల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరానని, పార్టీలోని కొందరు తన ఎదుగుదలను జీర్ణించుకోలేక కొంతకాలంగా…
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఆంక్షలను కఠినంగా అమలుచేస్తున్నారు. రోజువారీ కేసులు మహారాష్ట్రలో 11 వేలు దాటిపోయాయి. ముంబై నగరంలో 8 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ శాతం క్రమంగా పెరుగుతున్నది. దీంతో ముంబై నగరంలో లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ముంబై నగర మేయర్ కిషోరీ పడ్నేకర్ స్పందించారు. ముంబైలో లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని, ముంబైలో…
భారీవర్షాలతో బురదమయంగా మారాయి తిరుపతిలోని రోడ్లు. ఎల్ బీ నగర్ వీధిలో బురదను తొలగించారు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషా. వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే భూమన. అధికారులను అప్రమత్తం చేస్తూ ముందుకు పాగుతున్నారు. మరోవైపు వరద బాధితులకు తనవంతు సాయం అందిస్తున్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వరద ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు పంపిణీ చేసేందుకు నేవీ హెలికాప్టర్లో సరుకులను పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఎన్నిక నిర్వహణకు కార్పొరేషన్ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నగరపాలక సంస్ధ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరుగనుంది ఎన్నిక. మెజారిటీ కార్పోరేటర్లు అవిశ్వాసం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ లను తొలగిస్తూ ఈనెల 12న తీర్మానం చేశారు. ఈమేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాల మేరకు నేడు మేయర్,…
కాకినాడ మేయర్‌పై ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవిశ్వాస తీర్మానంలో సభ్యుల విశ్వాసం కోల్పోవడంతో పావని మేయర్ పదవిని కోల్పోయారు. అయితే, ఈ అవిశ్వాస తీర్మానంపై మేయర్ గతంలో కోర్టుకు వెళ్లారు. తీర్మానం ప్రవేశ పెట్టి ఓటింగ్ జరిగినప్పటికీ, ఆ ఫలితాలను ఈనెల 22 వరకు ప్రకటించ వద్దని హైకోర్టు పేర్కొన్నది. కానీ, ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం హడావుడిగా కాకినాడ మేయర్‌ను తొలగిస్తూ గెజిట్‌ను విడుదల చేసింది. దీనిపై మండిపడ్డ పావని, కేసు…
తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ మొత్తం వారి సొంతం అయింది. ఆక్రమించుకున్న వెంటనే అంతా బాగుంటుందని ప్రకటించారు. కానీ వారి మాటలను ఎవరూ నమ్మడంలేదు. కాబూలో తో పాటుగా కొన్ని ప్రాంతాలను ఈజీగా ఆక్రమించుకున్నా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తాలిబన్లు తీవ్రంగా పోరాటం చేయాల్పి వచ్చింది. అలాంటి వాటిల్లో ఒకటి చాహర్ కింట్ జిల్లా. ఈ జిల్లాకు సలీమా మజారీ అనే మహిళ మేయర్‌గా పనిచేస్తున్నది. తాలిబన్లు చేస్తున్న దండయాత్రను ఆమె సమర్ధవంతంగా ఎదుర్కొన్నది. దేశంలోని వివిధ…
ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటి వరకు సాగిన పాలనకు పూర్తి విరుద్దంగా పాలన జరగబోతున్నది. తాలిబన్ల చేతిల్లోకి అధికారం వెళ్లిపోయింది. రెండు దశాబ్దాల క్రితం ఎలాంటి కౄరమైన పాలనను అక్కడి ప్రజలు చూశారో దాదాపుగా అదేవిధమైన పాలనలను మళ్లీ ఇప్పుడు చూడబోతున్నారు. తాము శాంతియుతమైన అంతర్జాతీయ సంబంధాలు కోరుకుంటున్నామని చెబుతున్నప్పటికీ వారు ఎలాంటి పాలన అందిస్తారో అందరికీ తెలిసిందే. మహిళలు, చిన్నపిల్లలకు ఆ దేశంలో రక్షణ ఉండదు. 12 ఏళ్లు దాటిన మహిళలు ఎవరూ బయటకు రాకూడదు. చదువు…
గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ గుండె పోటుతో మరణించారు. రాజ్ కుమార్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ శ్రీ అంజన్ కుమార్ యాదవ్. హైదరాబాద్ లో ఒక మంచి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ.కోల్పోయింది.. క్రమశిక్షణ గా, పార్టీ కోసం పని చేసిన రాజ్ కుమార్ మరణం పార్టీ కి తీరని లోటు అని తెలిపారు. ఆయన…
ఆమె ఓ ప్రజాప్రతినిధి. నగర ప్రథమ మహిళ. నగరంలో తొలి గౌరవం ఆమెకే దక్కాలి. కానీ.. అక్కడ ఆ సీన్ లేదట. కార్యాలయ సిబ్బంది సైతం ఆమెను పట్టించుకోవడం లేదని టాక్. దీంతో పెద్ద పదవిలో ఉన్నా.. తగినంత గౌరవం దక్కడం లేదని లోలోన ఆవేదన చెందుతున్నారట ఆ మహిళా ప్రజాప్రతినిధి. ఇంతకీ ఎవరామె? చిత్తూరులో మేయర్‌ను పట్టించుకోని పార్టీ నేతలు ఎస్. అముద. చిత్తూరు మేయర్. రాజకీయాలకు కొత్త. పొలిటికల్ ఎంట్రీలోనే కార్పొరేటర్ అయ్యారు. రిజర్వేషన్…