Chigirintha Parijatha: రాజకీయాలు తట్టుకోలేకే రాజీనామా.. అందుకే ఆపార్టీలో చేరుతున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి భారీగానే రాజీనామాలు వెలువెత్తుతున్నాయి. అయితే.. నేడు టీఆర్‌ఎస్ కి మరో షాక్ తగిలిందనే చెప్పాలి.. బడంగ్‌పేట్ మేయర్ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె తన రాజీనామా లేఖను పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మెయిల్ ద్వారా పంపించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. బడంగ్‌పేట్ అభివృద్ధి కోసం అప్పటి పరిస్థితుల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరానని, పార్టీలోని కొందరు తన ఎదుగుదలను జీర్ణించుకోలేక కొంతకాలంగా వ్యతిరేక భావనను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా.. క్రమశిక్షణతో, పార్టీపై అంకితభావంతో ప్రజలకు సేవలందించిన తనకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని అన్నారు.. అంతేకాకుండా.. కక్ష సాధింపు రాజకీయాలు తట్టుకోలేకే రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటివరకు తమకు సహకరించిన పార్టీ పెద్దలకు.. నాయకులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Also Read
తాజావార్తలు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!