అమెరికాలోని వైట్‌హౌస్‌లో ఏటా దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. బరాక్ ఒబామా, ట్రంప్ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ వరకు అందరూ దివాళి వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే దీపావళి రోజున న్యూయార్క్‌లోని పాఠశాలలకు సెలవు ఇవ్వడం ఇదే మొదటి సారి. న్యూయార్క్ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న దిలీప్ చౌహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు.