మేషం : చేతి వృత్తి వ్యాపారాల్లో మార్పులు కనిపిస్తాయి. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వృషభం : పండ్లు, కొబ్బరి, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. చిన్నచిన్న విషయాలలో ఉద్రేకంమాని తెలివితేటలతో ముందుకుసాగి జయం పొందండి. మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై బాగా ప్రభావం చూపుతాయి.…