ఈనెల 26న అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈనెల 27 నుంచి ప్రారంభమయ్యే మహానాడులో ఆమోదించాల్సిన తీర్మానాలపై ఇందులో చర్చించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ఇతర అంశాలపై కూడా టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఇతర అంశాలపై కూడా చర్చిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతున్న తీరుపై…