తెలుగు నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి వరుసగా బయోపిక్ లపై దృష్టి సారించారు. ఎన్టీఆర్ బయోపిక్ తో మొదలైన ఆయన జీవిత కథల నిర్మాణం… ‘తలైవి’ పేరుతో జయలలిత బయోపిక్, 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు విజయగాథ ఆధారంగా ’83’ అనే మూవీలతో కొనసాగింది. అయితే తాజాగా విష్ణు వర్ధన్ ఇందూరి మరో బయోపిక్ ను ప్రకటించారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ రాసిన “మావెరిక్ కమీషనర్ : ది ఐపిఎల్-లలిత్ మోడీ…