ఆస్ట్రేలియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మాథ్యూ వేడ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల వేడ్ 2011లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై తన చివరి మ్యాచ్ ఆడాడు. 2021 నుంచి వన్డే, టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ 2021 గెలిచిన జట్టులో వేడ్ సభ్యుడిగా ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది…