Matthew Wade Retirement: భారత్‌తో సిరీస్ ముందు.. రిటైర్మెంట్ ప్రకటించిన ప్రపంచకప్ విన్నర్!
- మాథ్యూ వేడ్ కీలక నిర్ణయం
- అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్
- ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో వేడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మాథ్యూ వేడ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల వేడ్ 2011లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై తన చివరి మ్యాచ్ ఆడాడు. 2021 నుంచి వన్డే, టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ 2021 గెలిచిన జట్టులో వేడ్ సభ్యుడిగా ఉన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాది ఆస్ట్రేలియాను ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
13 ఏళ్ల కెరీర్‌లో మాథ్యూ వేడ్ 36 టెస్ట్‌లు, 97 వన్డేలు, 92 టీ20లు ఆడి.. 4700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు 13 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. బ్రాడ్ హాడిన్ వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగడంతో వేడ్ జట్టులోకి వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన వేడ్.. దేశవాలీ క్రికెట్, బిగ్‌బాష్ లీగ్‌లో మాత్రం కొనసాగుతాడు. రిటైర్మెంట్ అనంతరం ఆండ్రీ బోరోవెక్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో అతడు జాయిన్ అవుతాడు. వచ్చే నెలలో పాకిస్తాన్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి వేడ్ కొత్త బాధ్యతలు చేపడతాడు.
Also Read
Also Read: IPL 2025 Retention: షాకింగ్ న్యూస్.. ఛాంపియన్ ప్లేయర్‌పై వేటు! కోల్‌కతా రిటైన్ లిస్ట్ ఇదే
నవంబర్ 4 నుంచి ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. టీ20 సిరీస్‌లో మాథ్యూ వేడ్ కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపడతాడు. ఏదో ఓ రోజు హెడ్ కోచ్ కావాలన్నది వేడ్ ఆకాంక్ష. ఇక ఆస్ట్రేలియా వికెట్ కీపర్‌గా జోష్ ఇంగ్లిస్ ఆడనున్నాడు. జట్టులో స్థానం కోసం సీనియర్ కీపర్ టిమ్ పైన్‌తో ఇంగ్లిస్ పోటీ పడుతున్నాడు. పాక్ సిరీస్‌ల అనంతరం ఆస్ట్రేలియా స్వదేశంలో భారత్‌తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడుతుంది. భారత్‌తో సిరీస్ ముందు వేడ్ రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం.
తాజావార్తలు
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?