టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సోషల్ మీడియా ఉపయోగించుకుని మోసాలకు తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఎమ్మెల్యే ఫొటోలను ప్రొఫైల్ పిక్ గా వాడుకుని యువతులను బురిడీ కొట్టించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్నాడు. దీనికోసం షాడి డాట్ కామ్ ను ఉపయోగించుకున్నాడు. షాది డాట్ కామ్ మోసగాడి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి.…
ఆన్‌లైన్ పుణ్యమా అని.. ఎవరు అసలు.. ఎవరు నకిలీ అనే గుర్తించడమే కష్టంగా మారిపోయింది… ఆశ చూపుతూ అన్నీ దోచేస్తున్నారు.. అసలు విషయం తెలిసేలోపు.. అందినకాడికి దోచేస్తున్నారు.. తాజాగా, విశాఖ, మాట్రిమోనీ ముసుగులో మస్కా కొట్టిన ఘటన వెలుగుచూసింది.. రెండో వివాహం కోసం ప్రొఫైల్ పెట్టిన మహిళలే టార్గెట్‌గా.. వెబ్ సైట్‌లో పెట్టిన వివరాల ఆధారంగా మోసాలకు పాల్పడుతున్నారు నైజిరియన్లు.. విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నట్టు చెబుతూ పరిచయం చేసుకుంటున్న కేటుగాళ్లు.. విలువైన బహుమతులు పంపుతున్నామంటూ వల…