హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో ఏసీ పేలి భార్యాభర్తలతో పాటు కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. పెంపుడు కుక్క కూడా చనిపోయింది. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
ముంబైలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వర్లీ ప్రాంతంలోని అన్నీ బిసెంట్ రోడ్డులోని అట్రియా మాల్ ఎదురుగా ఉన్న పూనమ్ ఛాంబర్స్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే 10 ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్నాయి. అనంతరం.. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Fire Accident In Hotel: వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో పెద్ద తతంగమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు బస చేసిన హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటగాళ్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ పెను ప్రమాదం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి), వారి ప్రభుత్వ సన్నాహాలను బహిర్గతం చేసింది. ఇటువంటి పరిస్థితిలో, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌లో జరిగే…
Fire Accident In Mumbai: ముంబయిలోని అంధేరి ప్రాంతంలో ఉన్న భంగర్‌వాడిలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. రాత్రి 8 గంటల సమయంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వాహనాలు అంధేరీ ఈస్ట్‌లోని భంగర్‌వాడి ప్రాంతానికి…
Fire Accident : ఒడిశాలోని పూరీ జిల్లా సత్యవాడి బ్లాక్‌లోని అలిస్సా గ్రామంలో సోమవారం అర్థరాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 15 కుటుంబాలకు చెందిన 30కి పైగా ఇళ్లు కాలి బూడిదయ్యాయి.
దక్షిణ కొరియా బ్యాటరీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారని తెలిపారు. దాదాపు 35,000 యూనిట్లు ఉన్న గిడ్డంగిలో బ్యాటరీ సెల్స్ వరుస పేలిపోవడంతో మంటలు చెలరేగాయి.
హర్యానాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గురుగ్రామ్‌లోని మనేసర్‌లోని ఓ బట్టల తయారీ యూనిట్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.