పందాల పండుగకు రంగం సిద్దమవుతుంది. నెలల తరబడి చంటిబిడ్డల్లా సాకిన పందెం పుంజులను బరిలో దించేందుకు ముహూర్తం దగ్గర పడటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి అతిధులు ఇప్పటికే గ్రామాలకు చేరుకుంటున్నారు.. వీరితో పాటు పందాలపై మోజున్న జూదగాళ్ళంతా గోదావరి బాట పట్టారు. పెద్ద మొత్తంలో పందేలు కాసేందుకు సై అంటే సై అంటున్నారు.. ఇదే సమయంలో కూటమి నేతల మద్య పందాల నిర్వాహణ పోటి పెంచుతోంది.…