కొందరు వ్యక్తులు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఆడవాళ్లను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి డబ్బులు దండుకుంటున్నారు. భారత్ లో చాలా చోట్ల ఇలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్‌లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బంజారాహిల్స్‌లోని స్పా సెంటర్‌పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురు నిర్వాహకులు, 10 మంది యువతులు, 18 మందిని అదుపులోకి తీసుకున్నారు.