మాజీ ప్రధాని ఇందిరాగాంధీని 'భారతమాత'గా అభివర్ణించారు కేంద్రమంత్రి సురేష్ గోపి.. అంతేకాకుండా.. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్‌ను 'ధైర్యవంతమైన నిర్వాహకుడు' అని కొనియాడారు. కరుణాకరన్, ఇకె నాయనార్ తన "రాజకీయ గురువులు" అని అన్నారు. పున్‌కున్నంలో ఉన్న కరుణాకరన్ స్మారకం "మురళీ మందిరం"ని సందర్శించిన అనంతరం మంత్రి సురేష్ గోపి విలేకరులతో మాట్లాడారు.