తెలుగు తెరపై మలయాళ నటుల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది, తాజాగా ఆ జాబితాలో చేరిన మరో విలక్షణ నటుడు సుదేవ్ నాయర్. వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ, తెలుగు ప్రేక్షకులకు తనదైన విలనిజాన్ని రుచి చూపిస్తున్నారు. ఒకప్పుడు విలన్ అంటే కేవలం అరుపులు, కేకలే అనుకునేవారు కానీ ఇప్పుడు స్టైలిష్‌గా ఉంటూనే, కళ్లతోనే భయాన్ని పుట్టించే విలన్లకు కాలం నడుస్తోంది. అచ్చం అలాంటి బాడీ లాంగ్వేజ్‌తో తెలుగు సినిమా మేకర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు…