Nifty: గత వారం బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లో క్షీణత కనిపించింది. అయితే శుక్రవారం ఒక్క రోజులో కోలుకుంది. దీనికి ప్రధాన కారణాలు అమెరికా జీడీపీ గణాంకాలు. శుక్రవారం స్టాక్ మార్కెట్ లో కనిపించిన పెరుగుదల ఇన్వెస్టర్లు, నిపుణుల్లో ఆశలు రేకెత్తించింది.
Market Outlook: దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డు ర్యాలీ గత వారం ఆగిపోయింది. కొత్త శిఖరాన్ని తాకిన తర్వాత, గత వారంలో మార్కెట్ ప్రతిరోజూ క్షీణించింది. కేవలం 4 రోజుల్లోనే ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసేంతగా మార్కెట్ పరిస్థితి దిగజారింది.