ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో గో సంపదను సంరక్షించాలన్న సంకల్పంతో మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి చేసిన కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురానికి గోశాలను కేటాయించారు. లక్ష్మీ చెన్నకేశవ గోశాల కమిటీ సభ్యులందరితో ఎమ్మెల్యే సంప్రదింపులు జరిపి మార్కాపురం ప్రాంతంలో గోశాల నిర్మాణం చేయడం ద్వారా అనేకమంది భక్తులకు సెంటమెంటల్ గా బాగుంటుందని తెలిపారు. అంతేకాకుండా.. వీధుల వెంట తిరుగుతున్న ఆవులు ప్రజల జీవనానికి అనేక ఇబ్బందులు కల్పిస్తున్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే వారికి…
వెంటనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కొత్త లైన్లు లాగి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించడంతో కాలనీ వాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. దీంతో మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డికి జంగాళవారు కాలనీ వాసులు అందరూ ధన్యవాదాలు తెలిపి నీ మేలు మరువము నీకు రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు.
Markapuram MLA brother KP Krishnamohan Reddy Slams TDP Leaders: మార్కాపురం టీడీపీ నేతల భూదందాలు బయటపెట్టడంతో పాటు వారి ఆదాయానికి గండి కొట్టాననే ఉద్దేశంతో తమపై, వైసీపీ నాయకులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కేపి నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఈ దుష్ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. తమపై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ.. రాజకీయ లబ్ది పొందేందుకు కుట్రలు చేస్తున్నారని కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. గత రెండు రోజులుగా టీడీపీ…
ఈ రోజు ప్రకాశం జిల్లాలోని తన నియోజకవర్గం మార్కాపురంలో తర్లపాడు మండలం చెన్నారెడ్డి పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు వైసీపీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి.. తమ గ్రామ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు.. ఇక ఊర్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ.. అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు.
మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా ఉన్నారు. పొదిలి మండలంలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభోత్సవం చేశారు. మండలంలోని కుంచేపల్లి పంచాయితీ పరిధి ఉన్న గురువాయపాలెం నుంచి దాసర్లపల్లి వరకు ఒక కోటి 45 లక్షల రూపాయల సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు.
Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లా మార్కాపురం సీఎం జగన్ పర్యటనలో మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బాలినేనికి ప్రొటోకాల్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదు అధికారులు. మార్కాపురంలో సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ వద్దకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి వాహనాలను అధికారులు అడ్డుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని… అక్కడి నుంచి వెళ్లిపోయారు. నచ్చజెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేశ్, జిల్లా ఎస్పీ, ఇతర నేతలు ప్రయత్నించినా…
ఏపీలో సంక్షేమే ధ్యేమంగా ముందుకు సాగుతున్న వైసీపీ ప్రభుత్వం..ఇవాళ వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద డబ్బులు విడుదల చేయనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే సభలో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
YSR EBC Nestham: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఓవైపు సంక్షేమ పథకాలు అమలు, మరోవైపు పార్టీ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు.. ఇక, రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు సీఎం జగన్.. ఈ పర్యటనలో భాగంగా వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. మార్కాపురం పర్యటనకు రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్న ఆయన.. 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. ముందుగా ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో…