అబార్షన్‌పై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. మహిళలందరూ సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్ ప్రక్రియకు అర్హులేనని.. ఈ విషయంలో వివాహిత, అవివాహిత మహిళ మధ్య ఏదైనా వ్యత్యాసాన్ని చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.