ఒకప్పుడు భర్తల వేధింపులు భరించలేక భార్యలు ఆత్మహత్యలకు పాల్పడేవారు. తర్వాత కట్నం వేదింపులకు మహిళలు బలయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. భార్య వేదింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొంత మంది భర్తలు. సరిగ్గా గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరి పేర్లు బ్రహ్మయ్య, కౌసల్య. వీరిద్దరూ భార్యాభర్తలు. కాపురానికి వచ్చిన మొదటి మూడు నెలలు అంతా బాగానే ఉంది. తర్వాత అత్తతో కౌసల్యకు విభేదాలు మొదలయ్యాయి. అది కాస్తా ముదిరింది.…
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ఒక మహిళ పెళ్లి రోజు రాత్రి తన భర్తను చూసి ఆశ్చర్యపోయింది. తన భర్త నపుంసకుడు అని ఆరోపిస్తోంది. తన అత్తమామలు కట్నం కోసం నపుంసకుడితో తనకు వివాహం చేశారని ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని తన అత్తామామలకు చెబితే కొట్టి చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Marital Dispute: 40 ఏళ్ల టెక్ ప్రొఫెషనల్ ఆదివారం బెంగళూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ప్రశాంత్ నాయర్‌గా గుర్తించారు. వైవాహిక వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. మృతుడు లెనోవా లో సీనియర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.