మద్యం మత్తులో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మత్తులో ఉన్న వ్యక్తి విచక్షణ మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చావడికోటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తల్లిదండ్రులను అతికీరాతకంగా కత్తితో నరికి చంపాడు కొడుకు.. చావడి కోటకు చెందిన మృతులు సన్యాసిరెడ్డి (68), బోడెమ్మ (62) కుమారుడు మల్లిరెడ్డి.