ఈనెల 6న ఆదివారం ఉదయం షీ టీమ్స్ ఆధ్వర్వంలో 5కే రన్, 2కే రన్ నిర్వహించనున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు పీపుల్స్ ప్లాజా నుంచి లేపాక్షి, ట్యాంక్ బండ్, పీవీఎన్‌ఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెక్లెస్ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లే వాహనాలను షాదాన్ కాలేజ్, నిరంకారీ భవన్…