తెలంగాణ,మహారాష్ట్ర సరిహద్దుల్లో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైందా? తెలంగాణలోకి మావోయిస్టులు ఎంటర్ అయ్యారా? గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో ఒక్కసారిగా పోలీసులు ఎందుకు అప్రమత్తం అయ్యారు? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చాపకింద నీరులా మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని, మావోయిస్టుల చర్యలను తింపికొట్టేందుకు ముందస్తుగా పోలీసులు గోదావరి పరివాహక ప్రాంతాలలో కూంబీంగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో మహదేవపూర్,పలిమెల,మహాముత్తారం,మల్హార్ ,కాటారం మండలాలలో పోలీసులు నిత్యం…