‘చూసీ చూడంగానే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మను చరిత్ర’. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై నారల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ‘మను చరిత్ర’ ప్రీ ఫేస్ పేరుతో టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల…