ప్రేమలోని గాఢతను తెలిపేలా ‘మనుచరిత్ర’ టీజర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘చూసీ చూడంగానే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మను చరిత్ర’. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై నారల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ‘మను చరిత్ర’ ప్రీ ఫేస్ పేరుతో టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ”ఇంటెన్స్ లవ్ స్టోరీలతో వచ్చిన చిత్రాలు కచ్చితంగా హిట్ అవుతాయి. ఈ సినిమానూ దేనితోనూ పోల్చడం నా ఉద్దేశ్యం కాదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా భరత్ కథ రాసుకున్నాడు. ఎక్కడా కూడా వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు కనిపించవు. ఇక ఈ సినిమాకు అతి పెద్ద బలం గోపీ సుందర్. అద్బుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు మరో బ్యాక్ బోన్ ధనుంజయ. ఆయన ఇప్పుడు పద్నాలుగు సినిమాలను చేస్తున్నారు. రేపు ‘పుష్ప’ విడుదలయ్యాక ధనుంజయ ఏంటో తెలుస్తుంది” అని అన్నారు.
దర్శకుడు భరత్ మాట్లాడుతూ ”సిరాశ్రీ వల్లే ఈ చిత్రం ప్రారంభమైంది. ఆయనే రాజ్ కందుకూరితో కలిపించారు. ఆయనకు స్క్రిప్ట్ నచ్చింది. ఆ తరువాత శివ, మేఘా ఆకాష్, ప్రగతి ఇలా అందరూ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ధనుంజయ గారు ఈ సినిమాను ఒప్పుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. నేను ఏ కథ రాసినా ముందుగా మధు గారికి వినిపిస్తాను. ఆయనే నా ఫిలాసఫర్. సినిమాటోగ్రఫర్ రాహుల్ శ్రీవాత్సవ ఈ సినిమాలో తన లైఫ్ పెట్టేశారు. చంద్రబోస్ గారు మా సినిమాకు రెండు పాటలు రాయడమే కాకుండా నటించారు. సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ మత్తు కొంతసేపే ఉంటుంది. కానీ ‘మనుచరిత్ర’ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది” అని చెప్పారు.
Also Read
నిర్మాత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ”ఏ సినిమాకు అయినా కథే ముఖ్యం. సినిమాను చూపించినట్టుగానే రెండు మూడు గంటల పాటు డైరెక్టర్ భరత్ స్టోరీ నెరేషన్ ఇచ్చారు. ఈ సినిమాకు కథే బలం అని అప్పుడే అర్థమైంది. అందుకే వినగానే ఓకే చెప్పాం. మీడియా సహాయసహకారాలు అందిస్తే.. మేం మరిన్ని మంచి చిత్రాలను తీస్తాం” అని అన్నారు.
హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్క నటుడు తన కెరీర్‌లో ఓ సినిమా చేయాలి అనుకుంటారు. అదే మనుచరిత్ర’. నవ్వించాలి, ఏడిపించాలి, యాక్షన్ చేయాలని అనుకుంటారు. అలా హీరోలకు ఓ బకెట్ లిస్ట్ ఉంటుంది. నా బకెట్ లిస్ట్ అంతా కూడా ఈ ఒక్క చిత్రంతోనే నెరవేరింది. ఏ సినిమాకైనా మంచి యూనిట్ దొరకడం అదృష్టం. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరూ ప్రేమిస్తూ పని చేశారు. ప్రతీ ఒక్క ఫ్రేమ్‌లో అది మీకు కనిపిస్తుంది. నాకు ఈ చిత్రం ద్వారా సుహాస్, ధనుంజయ్ రూపంలో ఇద్దరు మంచి స్నేహితులు దొరికారు. ఈ సినిమా చూశాక మీరంతా కూడా మేఘా ఆకాష్ ప్రేమలో పడిపోతారు. నిర్మాత శ్రీనివాస్ రెడ్డి గారు మమ్మల్ని నమ్మి, దేని గురించి కాంప్రమైజ్ కాకుండా మాకు సపోర్ట్‌గా నిలిచారు. సెకండ్ వేవ్ తరువాత వచ్చిన చిత్రాలు మీడియా వల్లే ప్రేక్షకులకు అంతగా రీచ్ అవుతున్నాయి. నా సినిమా కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను” అని అన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!