అన్వేషణ, అభినందన లాంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒకప్పటి కోలీవుడ్ హీరో ‘కార్తీక్’. ఇతని కొడుకుగా ‘గౌతమ్ కార్తీక్’ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళనాట హీరోగా సెటిల్ అయిన ‘గౌతమ్ కార్తీక్’, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన మలయాళ బ్యూటీ ‘మంజిమ మోహన్’ని పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య చెన్నైలోని ఒక హోటల్ లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.…